![]() |
![]() |
.webp)
రోహిణి.. టెలివిజన్ నటి.. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది హృదయాలకి సన్నిహితం అయింది. అయితే అంతకు ముందే "ఓరి నా కొడక" సీరియల్ లో రోహిణి యాక్టింగ్ కి ఫిధా అయిపోయారు. ఆ సీరియల్ లో తను వడ దెబ్బ తగిలి కోమాలోకి పోవడమనే సీన్ అందరిని కడుపుబ్బా నవ్వించింది. ఈ సీన్ మీద ఎన్నో కామెడీ ట్రోల్స్ కూడా వచ్చాయి.
జబర్దస్త్ లో మొదట్లో చమ్మక్ చంద్ర స్కిట్ లో, అడపాదడపా రాకెట్ రాఘవ స్కిట్ లో క్యారెక్టర్ గా కనిపించిన రోహిణి.. మెల్లిగా తనని తాను ప్రూవ్ వేసుకుంటు సత్తిబాబుతో కలిసి రౌడీ రోహిణిగా టీమ్ లీడర్ గా మారింది. కాగా రోహిణి టిక్ టాక్స్ కు అప్పట్లో ఫుల్ క్రేజ్ ఉండేది. 'మత్తు వదలరా' సినిమాలో నటించిన రోహిణి.. కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. శ్రీనివాస కళ్యాణం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఇన్ స్పెక్టర్ కిరణ్ సీరియల్స్ లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-3లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. బిగ్ బాస్ తర్వాత బిజీ అయింది రోహిణి.
ప్రస్తుతం జబర్దస్త్ లో 'రౌడీ రోహిణి' అనే టీమ్ కి లీడర్ గా చేస్తూ తనదైన కామెడీతో ఆకట్టుకుంటుంది. రీసెంట్గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రని పోషించింది. ఈ సిరీస్ లో తన కామెడీతో నవ్వులు పూయించింది. దాంతో తనకి మరిన్ని సినిమా ఆఫర్లు వస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ మధ్య తన కాలుకి ఆపరేషన్ చేసుకొని ఇబ్బంది పడుతున్న రోహిణి.. ఇప్పుడిప్పుడే మళ్ళీ నార్మల్ అవుతుంది. కాగా తన ప్రతీ అప్డేట్ ని అటు తన యూట్యూబ్ ఛానెల్ లోను, ఇటు ఇన్ స్టాగ్రామ్ లోను షేర్ చేస్తోంది. తన ఆపరేషన్ తర్వాత.. "స్టైల్ మారింది నా నడక మారింది" అంటూ ఒక చేతికర్రతో నడుచుకుంటూ వస్తూ చేసిన రీల్ ఈ మధ్యే వైరల్ అయింది. "లైఫ్ లో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. సరే గాని ప్రాబ్లమ్స్ తో పాటు పొట్ట కూడా పెరుగుతుంది" అంటూ చేసిన రీల్ కి విశేష స్పందన లభిస్తోంది.
![]() |
![]() |